పేర్ని నానీ … ఫేజ్-1 నిబంధనలు తెలుసుకో? : కొనకళ్ల
మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) పై ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) చైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో కొనకళ్ల మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ పై తప్పుడు ప్రచారంతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నామని పేర్ని నానికి ఎవరు చెప్పారు? ఫేజ్-1లో ఒక్క ఎలక్ట్రిక్ బస్సు కొనలేదని ఆయన విమర్శలు చేస్తున్నారు. రవాణాశాఖ మంత్రిగా నాని పనిచేశారు కదా. ఫేజ్ -1 నిబంధనలు తెలుసుకో. 40 లక్షలకు పైబడి జనాభా ఉన్న నగరాల్లోనే ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని గతంలో కేంద్రం నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. అంత జనాభా ఉన్న నగరాలు మన రాష్ట్రంలో లేవు. అందుకే ఆనాడు రాష్ట్రానికి ఆ బస్సులు రాలేదు అని అన్నారు.
ఫేజ్-2లో జగన్ (Jagan) 100 బస్సులు ఎవరి జేబులోకి డబ్బులు తీసి కొన్నారో పేర్ని నాని చెప్పాలి. ఆ బస్సుల్లో ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి మరీ నడిపామని ఆయన పచ్చి అuద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. ఏది పడితే ఆది మాట్లాడేస్తే ప్రజలు నమ్మరు. వైసీపీ హయాంలో ఆర్టీసీని విచ్చిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం టెండర్లు పిలిచింది. ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధితో కృషి చేస్తోంది అని అన్నారు.
ఇవి కూడా చదవండి






