మొట్ట మొదటి బుల్లెట్ రైలు ఎలా వుంటుందో తెలుసా? చిత్రం విడుదల
దేశంలో మొట్ట మొదటి బుల్లెట్ రైలు ఎలా వుంటుందో రైల్వే శాఖ చిత్రాన్ని విడుదల చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ముంబై – అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. రెండు నగరాల మధ్య నడిచే హైస్పీడ్ రైలుకు సంబంధించిన తొలి చిత్రాన్ని రైల్వే శాఖ రైల్వే మంత్రిత్వ శాఖ భవనం గేటు నెంబర్ 4 వద్ద ప్రదర్శించారు. ప్రస్తుతం ఇది ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. పక్షి ఆకారం నుంచి ప్రేరణ పొందే, దీనిని రూపొందినట్లు తెలుస్తోంది.
ఈ బుల్లెట్ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ విధంగానే డిజైన్ చేశారు. ఇది అందుబాటులోకి రాగానే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గిపోతుంది. దాదాపు 7 గంటల సమయం పడుతుండగా.. బుల్లెట్ రైలులో కేవలం 2 గంటల సమయమే పడుతుంది. ఇందులో 8 కోచ్ లు వుంటాయి.
సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార, థానే, ముంబై… ఇలా మొత్తం 12 స్టేషన్లు వుంటాయి. వచ్చే యేడాది ఆగస్టు 15 న ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభం అవుతుంది.
ఇవి కూడా చదవండి






