పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ : గవర్నర్
దేశంలో పెట్టుబడులకు అగ్రగామి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అవిర్భవించిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) అన్నారు. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన యువ సంగంలో భాగంగా లోక్ భవన్ లోని దర్బార్ హాల్ లో మహారాష్ట్ర విద్యార్థుల (Maharashtra students)తో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశపు మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 25 శాతం పైగా వాటాను ఏపీనే దక్కించుకుందని పేర్కొన్నారు. భారతదేశానికి అమూల్యమైన కలికితురాయి ఏపీ. దేశ మత్స్య సంపద ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 శాతం వాటాతో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. భారత (Indian) కీర్తి కిరీటంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఒక అమూల్యమైన రత్నమని కొనియాడారు. స్వర్ణాంధ్ర-2047 దార్శనికత కేంద్రప్రభుత్వ విశిష్ట భారత్ కార్యక్రమానికి అనుగుణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి






