న్యూక్లియర్ ఎకానమీలో నమ్మకమైన భాగస్వామిగా ఏపీ : మంత్రి లోకేశ్
ఏపీని భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ (Lokesh) తెలిపారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఐ), యూఎస్-ఇండియా స్ర్టాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (యుఎన్ఐఎన్ పిఎఫ్) సంయుక్తంగా యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు లోకేశ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఇంధన భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం రియాక్టర్ సిస్టమ్స్, మాడ్యులర్ తయారీ, సప్లయ్ చైన్ పంపిణీ, స్కేలబుల్ వినియోగం నమూనాలకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్ (India) లో ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీరంగంలో విస్తృతి, ఖర్చు విషయంలో పోటీతత్వం ఉన్నాయని తెలిపారు. ఏపీ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక ఇన్ఫ్రా, పోర్టులు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, అమలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, ఇవి దేశానికీ, రాష్ట్రానికీ ఒక చరిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తాయన్నారు.
డేటా సెంటర్ (Data Center) ఎకోసిస్టమ్ చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ కూడా నిర్మించాలన్నదే మా లక్ష్యం. మేం కేవలం భూమి, విద్యుత్ గురించి మాత్రమే కాకుండా ఫుల్ స్టాక్ గురించి ఆలోచిస్తున్నాం. కూలింగ్ సిస్టమ్స్‌ను స్థానికంగా తయారు చేయడం, పవర్ ఎలకా్ట్రనిక్స్ ఎకోసిస్టమ్‌లను నిర్మించడం, ట్రాన్స్ఫార్మర్స్ తయారీని ప్రోత్సహించడం, బ్యాటరీ స్టోరేజి (Battery Storage) సప్లయ్ చైన్స్, సెమీకండక్టర్-అనుసంధాన పరిశ్రమలను ఆకర్షించడంపై దృష్టి సారించాం. ఏఐ విప్లవం ఈ గుర్తింపును మరింత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగస్వామ్యం వహించాలని ఏపీ కోరుకుంటోంది. ఏపీ భవిష్యత్తు కోసం ఎనర్జీ, పారిశ్రామిక పునాదులను నిర్మిస్తున్న తరుణంలో మేము దీర్ఘకాలిక దార్శనికతను పంచుకునే గ్లోబల్ నేతలతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాం. ఇక్కడ అవకాశాలు అపారమైనవి అని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి






