40 ఏళ్లనాటి సమస్యకు సీఎం పరిష్కారం : మంత్రి అనగాని
గల్ఫ్ లో యుద్ధం కారణంగా తలెత్తిన పరిణామాలతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. కొవిడ్ లాంటి విపత్తు రావచ్చు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అన్నారు. తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లె (Shettipalle) భూముల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. యుద్ధం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. దిగుమతులు తగ్గించుకోవాలంటే పొదుపు పాటించాల్సిందే. కొవిడ్ వంటి విపత్తు రావచ్చు, రాకపోనూ వచ్చు. ఏది జరిగినా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారం రాష్ట్రానికి దిక్సూచిలాంటిది. ల్యాండ్ పూలింగ్ కు చంద్రబాబు (Chandrababu) పునాదులు వేయడం వల్లే భూ సమస్యలను పరిష్కరించగలిగాం అని అన్నారు. శెట్టిపల్లె తరహా భూ సమస్యలు రాష్ట్రంలో పలుచోట్లు ఉన్నాయి. వీటిని ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా సెటిల్ చేస్తున్నాం. నెల్లూరు (Nellore)లో కూడా 40 ఏళ్లుగా ఉన్న భూసమస్యను సీఎం పరిష్కరించారు. ఇదే విధానంలో విశాఖపట్నంలోని సమస్యనూ పరిష్కరిస్తున్నాం అని అన్నారు.
ఇవి కూడా చదవండి






