Minister Anagani: చంద్రబాబు మీద నమ్మకంతో భారీగా పెట్టుబడులు : మంత్రి అనగాని
వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థిరత్వం లేని వ్యక్తి అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) విమర్శించారు. రాజధాని అమరావతి (Amaravati) విషయంలో ఆయన ఒక్కోసారి ఒక్కోమాట మాట్లాడారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం సత్యప్రసాద్ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని చెప్పిన జగన్ (Jagan) , అధికారంలోకి రాగానే మాట మార్చారు. మూడు రాజధానులంటూ ఒకసారి, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని మరోసారి వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయాక నాగార్జున యూనివర్సిటీలో పెడితే సరిపోతుందన్నారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయడం వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారు. ఓట్లు వేయలేదని ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. చంద్రబాబు (Chandrababu) మీద నమ్మకంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఫ్రీీVAల్డ్ భూముల సమస్యకు పరిష్కారం చూపుతాం. 22ఏ భూములపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








