సమంత విషయంలో చిరూ లీక్ ఇచ్చారా?
సోషల్ మీడియాలో ఇటీవల ఎక్కువగా చర్చకు దారితీసిన అంశాల్లో సమంత(samantha) వ్యక్తిగత జీవితం ఒకటిగా మారింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన ఒక అభినందన పోస్టు ఈ డిస్కషన్ కు మరింత ఊపునిచ్చింది. సమంత ప్రధాన పాత్రలో రూపొందిన మా ఇంటి బంగారం(maa inti bangaram) సక్సెస్ పై స్పందించిన ఆయన, సినిమా యూనిట్‌ను అభినందిస్తూ ప్రత్యేకంగా సమంత నటనను ప్రశంసించారు. ముఖ్యంగా చీరకట్టులో యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపించిన అంకితభావం ప్రేక్షకులను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
అయితే పోస్టు చివర్లో సమంత, రాజ్(Raj)లకు జీవితంలో కొత్త అధ్యాయానికి స్వాగతం అంటూ చెప్పిన శుభాకాంక్షలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఆ ఒక్క వాక్యం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవడంతో, దాని వెనుక ప్రత్యేకమైన అర్థం ఉందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు దీనిని దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంకేతంగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం అది సాధారణ శుభాకాంక్ష మాత్రమే అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత కనిపించిన తీరు కూడా పలు ఊహాగానాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ప్రచారంపై సమంత గానీ, రాజ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.








