“సర్” ప్రక్రియలో పాల్గొన్న మంత్రి లోకేష్
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఉండవల్లి లోని తమ నివాసానికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ అడిగిన సమాచారం, డాక్యుమెంట్లను మంత్రి లోకేష్ సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియలో పాల్గొనే ప్రజలు ఏదైనా డౌట్లు ఉంటే ఆయా వార్డుల్లో నియమితులైన బీఎల్ఓలను సంప్రదించాలని, ఇందుకోసం సహకరించేందుకు తెలుగుదేశం పార్టీ తరపున బూత్ లెవల్ ఏజంట్లు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు.








