మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం: చంద్రబాబు
మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చరిత్రలో తొలిసారి రూ.262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రూ.3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. బోటూ (Boat) మనదే, వేటా మనదే అని అన్నారు. మన జలాల్లోకి వేటకి వస్తే వెంటాడతాం. మన రాష్ట్ర తీరంపై మనకే పూర్తి హక్కులు. ఇతర రాష్ట్రాల బోట్లు వస్తే శాటి లైట్ (Satellite) తో గుర్తిస్తాం అని వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులకు ఇబ్బందులు ఉండవన్నారు. జువ్వలదిన్నె హార్బర్ ను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. చేపలు మంచి ప్రొటీన్ అని, చేపలు (Fish) తింటే డయాబెటిస్ (Diabetes) రాదన్నారు. మీ చేపల ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తా అని అన్నారు. 200 మెకనైజ్డ్ బోట్ల మంజూరుతో పాటు రాయితీ ఇస్తామన్నారు.
ఇవి కూడా చదవండి






