కవిత అడిగే ప్రశ్నలకు జగదీశ్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా? : అద్దంకి
కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారని జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ (Congress) తో కలిసి పనిచేస్తున్న సంగతి ఆయనకు తెలియదా? ప్రశ్నించారు. ముందు ఆ పార్టీ ఉంటుందో, ఉండదో చూసుకోవాలి. ఉంటే జగదీశ్ రెడ్డి ది ఏ వర్గం? కేటీఆర్ వర్గమా, లేక హరీశ్ వర్గమా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న కవిత (Kavitha) అడిగే ప్రశ్నలకు జగదీశ్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా అని నిలదీశారు.
ఇవి కూడా చదవండి






