‘డోంట్ స్లీప్’ నుంచి టాంజిన్ గా సునీల్ థాపా ఫస్ట్ లుక్ రిలీజ్
‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా, మమ్ముట్టి నటించిన ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ రూపొందుతోంది. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రివిల్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ థాపా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ప్రేమతో స్మరించుకుంటూ ఈ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆయన పోషించిన “టాంజిన్” పాత్ర పవర్‌ఫుల్‌గా, ప్రభావవంతంగా ఉండబోతోంది.
తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో సునీల్ థాపా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి పనిచేసిన మోనికా-రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని గోకుల్ హర్షన్ అందించారు. స్టేట్ అవార్డు గ్రహీత అయిన మనోజ్ ఎడిటింగ్ చేశారు. గతంలో RDX , దుల్కర్ సల్మాన్ నటించిన ఐయామ్ గేమ్ చిత్రాలకు పనిచేసిన సజీర్, లూనా కథను అందించారు.
ఎమోషనల్, టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్ప సైకాలజికల్ థ్రిల్లర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుంది.






