ఇదే లాస్ట్ ఛాన్స్ .. ఆ ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం (Kavali Constituency) తుమ్మలపెంటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి (D.V. Krishna Reddy) ప్రసంగాలు బాగున్నాయి. కానీ పనితీరే సంతృప్తికరంగా లేదు. అధికారం ఉందని పదిమందిని వెంటేసుకుని తిరగడం కాదు. అలా చేస్తే పార్టీ నిర్వీర్యమవుతుంది. పార్టీ కోసం పనిచేసేవారిని వదిలి. మీ ఇళ్లలో ఉండేవారికి పదవులు ఇవ్డం, ఆపై మీరే పెత్తనం చేయడం తగదు. కొన్ని క్లస్టర్లు, పంచాయతీల్లో పరిశీలిస్తే, పార్టీ పరిస్థితి సీ గ్రేడ్ కు పరిమితమైంది. అందరినీ కలుపుకొని పోవాలి. పార్టీలోనే ఉంటూ కొందరు అలకబూని ఇంట్లో ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎమ్మెల్యేగా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. దురుసుతనం తగ్గించుకుని అందరితో కలిసి వెళ్లాలి అని సూచించారు.
రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరిలో కావలి ఎమ్మెల్యే 107వ స్థానంలో ఉన్నారు. అందరి డేటా (Data) నా దగ్గరి ఉంది. కార్యకర్తలు కూడా రోడ్లపైకి రావాలి. ప్రతిపక్షంలో ఉంటేగానీ జ్ఞానోదయం కదా? మహిళలకు సగభాగం రిజర్వేషన్లు అని చెబుతున్నా, కార్యక్రమంలో మహిళలు తక్కువగా ఉండడమేంటి? ఈ ఏడాదిలోనే సహకార, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. వాటిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలి. 2019-24 మధ్యలో జరిగిన పాలనను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలి అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







