బాలయ్య సినిమాతో మనోజ్ లైఫ్ మారిపోనుందా?
టాలీవుడ్లో ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్న కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna)- మంచు మనోజ్(manchu manoj). డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తెరకెక్కిస్తున్న బాలయ్య కొత్త సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ అప్డేట్ను ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇందులో అసలు హైలైట్ ఏమిటంటే.. మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడనే ప్రచారం. మేకర్స్ ఇంకా మనోజ్ క్యారెక్టర్ పై క్లారిటీ ఇవ్వకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఇదే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే తన సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా భిన్నమైన పాత్రలపై దృష్టి పెట్టిన మనోజ్, రీసెంట్ గా మిరాయ్(miraai), భైరవం(Bhairavam) లాంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ కలిసిన పాత్రల్లో మనోజ్ చూపిస్తున్న ఎనర్జీ డైరెక్టర్లను ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి సమయంలో బాలకృష్ణ లాంటి మాస్ స్టార్ సినిమాల్లో పవర్ఫుల్ విలన్‌గా అవకాశం రావడం అతని కెరీర్‌కు కీలక మలుపుగా మారొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా(Oo Kodathara Ulikki Padathara) సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్ర పోషించగా, ఇప్పుడు బాలయ్య సినిమాకే మనోజ్ రంగంలోకి దిగడం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. గోపీచంద్ మలినేని స్టైల్లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన విలన్ పాత్రలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉండటంతో, ఈ సినిమాలో మనోజ్ పాత్రను కూడా అదే స్థాయిలో డిజైన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో బాలయ్య- మనోజ్ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్లో పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి







