ఇంట్లో తయారు చేసే కారం పొడి రంగు, సువాసన మరియు నాణ్యతను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ఒక సాధారణ సవాలుగా ఉంటుంది. అందుకే చాలా మంది మార్కెట్లో దొరికే రెడీమేడ్ కారం పొడి వాడుతారు.
సరైన తయారీ విధానం మరియు నిల్వ పద్ధతులు పాటిస్తే కారం పొడి ఎక్కువ కాలం తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎరుపు రంగు నిల్వ ఉండాలంటే కొన్ని ప్రొఫెషనల్ పద్ధతులు అవసరం.
కారం రంగు బాగుండాలంటే కొత్తగా ఎండబెట్టిన, ప్రకాశవంతమైన ఎండుమిరపకాయలనే ఉపయోగించాలి. పాత మిరపకాయలు రంగును మసకబారుస్తాయి.
గ్రైండింగ్ చేసే ముందు మిరపకాయలు పూర్తిగా ఎండిపోయి ఉండాలి. చిన్నపాటి తేమ శాతం కూడా ఆక్సిడేషన్ ప్రక్రియను వేగవంతం చేసి రంగు తగ్గిపోవడానికి దారితీస్తుంది.
తయారీ అనంతరం కారం పొడిని వెంటనే గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి. గాలి తాకిడి తగ్గించడం ద్వారా రంగు , సువాసన ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.
నిల్వ సమయంలో తేమను నియంత్రించడం అత్యంత ముఖ్యం. డబ్బాలో చిన్న ఎండిన బిర్యానీ ఆకు వంటి పదార్థాలు ఉపయోగించడం ద్వారా తేమ శోషణ తగ్గించవచ్చు.
కారం తీసుకునే సమయంలో ఎప్పుడూ పొడి చెంచా మాత్రమే ఉపయోగించాలి. తేమ లేదా నీటి తాకిడి వల్ల నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.
నేరుగా సూర్యరశ్మి పడని, చల్లని , పొడి ప్రదేశంలో నిల్వ చేయడం ఉత్తమం. అధిక ఉష్ణోగ్రతలు రంగు ఆక్సిడేషన్‌ను వేగవంతం చేస్తాయి.
ఈ పద్ధతులు పాటిస్తే ఇంట్లో తయారు చేసిన కారం పొడి కూడా దీర్ఘకాలం పాటు సహజమైన ఎరుపు రంగు, రుచి మరియు నాణ్యతను నిల్వ ఉంచుకోవచ్చు.