రెహమాన్ ఫోకస్ మొత్తం దానిపైనే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్దిపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(A. R. Rahman) చేస్తున్న వర్క్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం తర్వాత ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు కమిట్ అయిన రెహమాన్, దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. కథ వినగానే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిన ఆయన, ప్రస్తుతం పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులపైనే దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకోగా, త్వరలో రానున్న ఐటమ్ సాంగ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రెహమాన్ ఇప్పటికే పూర్తి చేసి టీమ్‌కు అందించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌తో పాటు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కీలక ఎలివేషన్స్ కోసం ఆయన డిఫరెంట్ సౌండ్ డిజైన్‌పై పని చేస్తున్నారట. ప్రస్తుతం సెకండ్ హాఫ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్న రెహమాన్, పెద్ది కోసం ఇతర కొత్త ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా సినిమా గురించి ఆయన చూపించిన నమ్మకం ఇప్పుడు ఫ్యాన్స్‌లో మరింత హైప్ పెంచుతోంది.
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్(Peddi Trailert)కు అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన రావడంతో పెద్దిపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, నిర్మాణాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) సంస్థలతో కలిసి వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) నిర్మిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, సంగీతం మరియు ఎమోషన్స్ పరంగా కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.







