యూపీలో బీఎస్పీతో పొత్తుకు రెడీ అవుతున్న కాంగ్రెస్…
యూపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా అధికారంలో వున్న బీజేపీ కూడా. ఈ నేపథ్యంలో సీఎం యోగి కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో కులాల సమీకరణలు, నియోజకవర్గాల సమీకరణను పక్కాగా పాటించారు. దీంతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు కేంద్రంలో వున్న నరేంద్ర మోదీ కూడా తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తారని, అందులో యూపీ నుంచే కొత్త వారికి అవకాశాలిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.
మరో వైపు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కూడా తమ వంతు ప్రయత్నాలను ఇప్పటి నుంచే ప్రారంభించాయి. దీనికి సంబంధించి, తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ సారి మాయావతి సారథ్యంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
దీనిని బలపరుస్తూ.. యూపీలో కాంగ్రెస్ కీలక నేతలైనరాజేంద్ర పాల్ గౌతమ్ మరియు తనుజ్ పునియా బీఎస్పీ అధినేత్రి మాయావతిని నివాసానికి వెళ్లి మరీ కలిసొచ్చారు. అయితే.. ఇది కేవలం సాధారణ భేటీయే అని చెబుతున్నా.. రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు కలిసినట్లు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో గానీ, లేదా ‘INDIA’ కూటమితో గానీ పొత్తు పెట్టుకునే విషయమై ప్రస్తుతానికి ఎటువంటి రాజకీయ సంకేతాలు పంపడానికి BSP అధినేత్రి ఆసక్తి చూపించడం లేదన్నదానికి ఈ పరిణామం ఒక సూచికగా పరిగణించబడుతోంది.
విచిత్రం ఏమంటే 2024 లోకసభ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. ఆ సమయంలో, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ, “రాజ్యాంగాన్ని రక్షించడమే” లక్ష్యంగా కలిగిన భావసారూప్యత గల పార్టీలన్నీ ఏకం కావాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బహిరంగంగా ప్రకటించింది; ఈ క్రమంలో ‘INDIA’ కూటమిలో చేరాల్సిందిగా BSPకి బహిరంగ ఆహ్వానాన్ని కూడా అందించింది.UP అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ప్రతిపక్షాల పునఃసమీకరణ సాధ్యమేమోనన్న చర్చలను తాజా పరిణామం మరోసారి రేకెత్తించింది.
ఇవి కూడా చదవండి







