‘ఎన్టీఆర్ నీల్’ టైటిల్ ‘డ్రాగన్’.. అదిరిపోయే పవర్ఫుల్ గ్లింప్స్‌తో మాస్ హంగామా షురూ
ప్రపంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన కెజియఫ్ సిరీస్, సలార్ పార్ట్ వన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ కాంబోలో రూపొందుతోన్న హై ఎక్సెపెక్టెడ్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఎన్టీఆర్‌నీల్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ‘డ్రాగన్’గా ఖరారు చేస్తూ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. 4 నిమిషాల 28 సెకన్ల ఈ గ్లింప్స్ 1967 నేపథ్యంలో నడిచే చీకటి ప్రపంచాన్ని చూపిస్తుంది. రుక్మిణి వసంత్ పాత్రను పరిచయం చేవారు. ఆమె పవిత్రమైన బైబిల్ గ్రంథంలోని తొలి అధ్యాయాన్ని వివరిస్తుంటుంది. ఆమెకు వాయిస్ ఓవర్‌కు అనుగుణంగా ప్రతి వాక్యానికి అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన భయంకరమైన, క్రూరమైన విలన్స్‌ను చూపించారు.
ఈ కథ “గోల్డెన్ ట్రైయాంగిల్” ప్రాంతంలోని అంతర్జాతీయ అఫీమ్ (ఓపియం) అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో.. అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అస్సాసిన్-ఇన్-చీఫ్ఫ్ అనే భయంకరమైన కొత్త అవతారంలో కనిపిస్తారు. రుక్మిణి వసంత్ ఆయన్ని డెవిల్ అని సంబోధిస్తుంది. ఓపియం వ్యాపారంపై ఆధిపత్యం సాధించేందుకు అందరూ పోరాడుతున్న సమయంలో, ఈ పాత్ర కథలోని ప్రధాన సంఘర్షణకు కేంద్రబిందువుగా నిలుస్తుంది.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పే తీరు, స్క్రీన్‌పై ప్రెజెన్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. సన్నగా, దృఢమైన ఫిజిక్‌తో పాటు డిఫరెంట్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించడంతో ఈ సినిమాపై ఉన్న హైప్ నెక్ట్స్ లెవల్‌కు చేరింది. ఒక సన్నివేశంలో ఆయన శవాలున్న గుట్ట మధ్య కొండపై నిలబడి కనిపించడం ఆయన పాత్రలోని తీవ్రతను తెలియజేస్తోంది. మొత్తం గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించి, సినిమా విడుదల కోసం ఎదురు చూడాలనే ఉత్సాహాన్ని పెంచింది.
బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ ఈ చిత్రంలో భారత నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో నటించారు. చిత్రబృందం పలువురు నటీనటులను..వారి పాత్రలను కూడా పరిచయం చేసింది. వారిలో బిజూ మీనన్, రుక్మిణి వసంత్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రానా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భీమల్ జీత్ ఒబెరాయ్ తదితరులు ఇందులో తమదైన నటనతో మెప్పించనున్నారు.
డ్రాగన్ మూవీపై ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచేలా చిత్రబృందం సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం 2027 జూన్ 11వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారీ రిలీజ్ డేట్‌గా ఇది మారింది. సిక్స్‌ప్యాక్ అబ్స్‌తో దృఢమైన ఫిజిక్‌లో కనిపిస్తోన్న ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసే యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు కన్నుల పండుగగా నిలవనున్నాయి.
డ్రాగన్ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం తదితర భాషల్లో విశేష ప్రేక్షకాదరణతో విడుదల కానుంది. ఎన్టీఆర్ నీల్ మూవీగా ఈ ‘డ్రాగన్’ భారీ యాక్షన్‌తో పాటు ఆసక్తికరమైన కథను కలగలిపిన థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోందని అందరూ భావిస్తున్నారు. అందుకే ఇది వచ్చే ఏడాదిలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చలపతి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.







