ఆర్థిక ఇబ్బందులు ఉన్నా … ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్
ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. వరుసగా రెండో ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన అభివర్ణించారు. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతా (Bank account)ల్లోనే జమ చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుందన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.262 కోట్లను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.కాకినాడ జిల్లా (Kakinada District)లో 24,930 మంది లబ్ధిదారులకు రూ.49.86 కోట్లు, పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency)లో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని వివరించారు. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీర పరిధిలో 23 ల్యాండింగ్ సెంటర్లతోపాటు 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు వారికి ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి







