వైసీపీకి మరో షాక్ … బైరెడ్డి సిద్దారరెడ్డిపై కేసు
నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy) పై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharat) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) సిద్దార్థరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కర్నూలు (Kurnool) కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్ని బైరెడ్డి మంత్రిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ రూ.45 కోట్లు లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భరత్, బైరెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై పరువు నష్టం దావా కూడా వేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







