మెట్రో ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీనది (Musi River) లో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.3.975 కోట్లని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాపై చర్చించాం. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశ డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పారు. మెట్రోకు సూత్రప్రాయ అంగీకారానికి కేంద్రానికి అభ్యంతరం లేదు. కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పారు. ఇక 39 ఎస్ టీపీ ల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందని మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. వారికి హైదరాబాద్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశా అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి







