మెట్రో ‘ప్రభుత్వ’ ప్రయాణం.. ఎల్ అండ్ టీ వాటా కొనుగోలుకు రంగం సిద్ధం.
Metro: హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌కు చెందిన 100 శాతం ఈక్విటీని కొనుగోలు చేయడానికి సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (SPA) పై సంతకాలు చేయడమే ఇప్పుడు ప్రధాన ఘట్టం.
రూ. 379.19 కోట్ల బకాయిలపై చర్చలు..
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, విద్యుత్ శాఖ (TGSPDCL), జీహెచ్ఎంసీకి మెట్రో సంస్థ చెల్లించాల్సిన సుమారు రూ. 379.19 కోట్ల బకాయిలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
జీవో జారీ..
ఏప్రిల్ 30 నాటికి ప్రాజెక్టు అప్పు రూ. 13,615 కోట్లకు చేరింది. మిగిలిన రూ. 1,385 కోట్లను ఈక్విటీగా చెల్లించడానికి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది.
పేరు మార్పు..
మెట్రో ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చినప్పటికీ, పేరు మార్పు ప్రక్రియకు మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ (L&TMRHL) పేరుతోనే కొనసాగుతుంది.
కీలక అంశాలు ..
ఈ SPA ఒప్పందంలో వాటాల ధర, పన్నుల ఇండమ్నిటీ, ఉద్యోగుల జీతభత్యాలు, , ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వంటి కీలక అంశాలు ఉంటాయి.ఈ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత మెట్రో అధికారికంగా ప్రభుత్వ పరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.







