విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ పథకానికి దివిస్, అరబిందో ఫార్మా విరాళం
MCRHRD లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు
దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల తరపున ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం కు సిఎం సమక్షంలో CSR నిధులను ఫౌండేషన్ కు అందజేత
అరబిందో ఫార్మా లిమిటెడ్ తరపున రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ తరపున రూ.12.18 కోట్లు అందజేత
హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం
సెంట్రలైజ్డ్ కిచెన్ లను ఏర్పాటు చేసిన చోట పరిసర ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించిన సీఎం
అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి తీసుకునేలా రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు తెలిపిన సీఎం
రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించిన సీఎం
తద్వారా పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించినట్లవడమే కాకుండా రైతులకు లాభాలను అందించవచ్చని అభిప్రాయపడిన ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా CSR నిధులను అందించిన సంస్థలను అభినందించిన సీఎం
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు, అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.








