జయ కృష్ణకు మహేష్ సపోర్ట్.. ఓపెనింగ్స్‌ను మార్చేస్తుందా?
వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి జయ కృష్ణ(Jaya krishna) హీరోగా పరిచయం అవుతుండటం ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. మరోవైపు ఆర్ఎక్స్100(RX100) తర్వాత ప్రత్యేకమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వం వహించగా, మోహన్ బాబు(mohan babu) చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రావాలంటే స్టార్ పవర్ కూడా తోడవాల్సిందేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటే సినిమాకు ఒక్కసారిగా విపరీతమైన ప్రమోషన్ లభించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయన పూర్తిగా వారణాసి(Varanasi) షూటింగ్లో బిజీగా ఉండటంతో ఈవెంట్ కు వస్తారనే విషయంపై క్లారిటీ లేకపోయినా, అభిమానుల్లో మాత్రం ఆశలు కొనసాగుతున్నాయి.
ఒకవేళ ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ వస్తే సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ కు దారి తీసే అవకాశముంది. ఆ బజ్ డైరెక్ట్ గా అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈవెంట్‌కు రావడం సాధ్యంకాకపోయినా, సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో ఆయన పాల్గొంటే జయ కృష్ణకు ఫ్యామిలీ నుంచి బలమైన మద్దతు లభించిందనే సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.








