కళ్యాణ్‌రామ్ తో పరశురామ్ సినిమా?
డైరెక్టర్ పరశురామ్(parasuram) తర్వాతి సినిమా విషయంలో నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన రెడీ చేసిన కొత్త కథకు నందమూరి కళ్యాణ్‌రామ్ (nandamuri kalyanram) నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించినట్టు టాక్ వినిపిస్తోంది. గత సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొత్త ప్రాజెక్ట్ ఎంపికలో పరశురామ్ చాలా ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు స్టార్ హీరోలకు కథ వినిపించినా ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో, ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌తో ఆయన జర్నీ మొదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ తన చేతిలో ఉన్న మల్టీస్టారర్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఇద్దరి మధ్య కథకు సంబంధించిన డిస్కషన్స్ సానుకూలంగా ముగిశాయని, స్క్రిప్ట్‌లో చివరి మెరుగులు దిద్దే పనులు కూడా కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం వెలువడలేదు.
మరోవైపు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు(Dil Raju) నిర్మించే అవకాశాలపై కూడా డిస్కషన్ సాగుతోంది. పరశురామ్‌తో ఆయనకు గతంలో సక్సెస్ఫుల్ బాండింగ్ ఉండటంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఖరారైతే పరశురామ్‌కు ఇది కెరీర్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. అలాగే విభిన్న కథలకు ప్రాధాన్యం ఇస్తున్న కళ్యాణ్‌రామ్ ఫిల్మోగ్రఫీలో మరో కొత్త తరహా సినిమా చేరే అవకాశముంది. అఫీషియల్ అనౌన్స్హెంట్ వచ్చేవరకు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మాత్రం కొనసాగనుంది.








