విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యాలను బాధ్యులను చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై అధికారులకు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలి
విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి సంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేయాలి
క్యాంపస్ లోపల డ్రగ్స్ కు సంబంధించి ఏ ఘటనకైనా యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలి
డ్రగ్స్ విషయంలో క్యాంపస్ బయట జరిగే యాక్టివిటీని గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి
విద్యాసంస్థలకు అధికారంతో పాటు బాధ్యతను అప్పగించాలి
విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలి
డ్రగ్స్ కు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి
గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం ఈ మూడు దశలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టండి
డ్రగ్స్ స్వీకరించి పట్టుబడితే డీ-అడిక్షన్ సెంటర్ కు తరలించాలి.
తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించండి
డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయండి.








