మొదటి కథ పక్కన.. రెండో కథకు వెంటనే ఓకే చెప్పిన సూర్య
డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri)- సూర్య(Suriya) కాంబినేషన్లో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath and sons) వెనుక ఇంట్రెస్టింగ్ విషయాలు చోటుచేసుకున్నాయని తాజాగా వెంకీ వెల్లడించారు. మొదట ఈ సినిమాను చేయాలన్న ఆలోచన లేదని, సూర్యకు తాను పూర్తిగా భిన్నమైన కథను వినిపించినట్లు చెప్పారు. ఆ కథ ఒక బయోపిక్ కావడంతో సూర్య కూడా దానిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే కథకు సంబంధించిన రైట్స్, ఇతర ప్రొడక్షన్ రిలేషన్ అంశాల్లో క్లారిటీ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేకపోయిందని వివరించారు. దీంతో ఇద్దరూ మరో స్టోరీపై డిస్కషన్స్ ప్రారంభించినట్లు వెంకీ అట్లూరి వెల్లడించారు.
ఆ టైమ్ లో వరుసగా రెండు బయోపిక్‌లలో నటించిన సూర్య, ఈసారి పూర్తిగా భిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు డైరెక్టర్ వెంకీ తెలిపారు. ఆ నేపథ్యంలో తాను 40 ఏళ్ల వ్యక్తి, 20 ఏళ్ల అమ్మాయి మధ్య ఎమోషనల్ బాండింగ్ ను బేస్ చేసుకుని రాసుకున్న మరో కథను వినిపించానన్నారు. తొలి నేరేషన్కే ఆ కాన్సెప్ట్ సూర్యకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. అంత వేగంగా సినిమా రూపుదిద్దుకోవడం తనకే ఆశ్చర్యంగా అనిపించిందని వెంకీ పేర్కొన్నారు.
అలా ప్రారంభమైన ఈ ప్రయాణమే ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుందని వెంకీ తెలిపారు. ఇటీవల రిలీజైన టీజర్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్ ను ప్రతిబింబించే కథాంశం కారణంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్యను మరోసారి సాప్ట్ రోల్ లో చూడబోతున్నామనే అంచనాలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుండగా, వెంకీ అట్లూరి- సూర్య కలయిక ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.








