తిరుమల కిషోర్‌తో సాయిపల్లవి లేడీ ఓరియెంటెడ్ మూవీ?
డైరెక్టర్ కిషోర్ తిరుమల(kishore tirumala) తన తర్వాతి సినిమాకు పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారనే ప్రచారం ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇప్పటివరకు ఫ్యామిలీ స్టోరీస్, ఎమోషన్స్ కు ప్రాధాన్యమిచ్చిన ఆయన ఈసారి లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ కథలో దైవిక నేపథ్యం, పురాణాల స్పర్శ, బలమైన భావోద్వేగాలు కలగలిపి ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. కథ మొత్తం మహిళా పాత్ర చుట్టూనే తిరిగేలా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్ర కోసం సాయిపల్లవి(sai pallavi) పేరును పరిశీలిస్తున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. పాత్రకు ఉన్న ప్రాధాన్యం, యాక్టింగ్ కు ఉన్న భారీ అవకాశం దృష్ట్యా ఆమెకు ఈ కథను వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. కథలోని ఎమోషనల్ స్ట్రెంగ్త్, పాత్ర ప్రయాణం ఆమెను ఆకట్టుకున్నాయని, అందుకే ఈ సినిమాపై సానుకూలంగా స్పందించినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు.
కెరీర్ స్టార్టింగ్ నుంచే యాక్టింగ్ కు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్న సాయిపల్లవి, కథలో విషయం ఉంటేనే అంగీకరించే నటి అనే గుర్తింపు సంపాదించారు. అలాంటి ఆమె ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం నిజమైతే, ఇది మరో బలమైన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ఫైనల్ డెసిషన్ తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, నిర్మాణ సంస్థతో పాటు ఇతర వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








