రెరా చైర్మన్ సత్యనారాయణ రాజీనామా
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) చైర్మన్ ఎన్ సత్యనారాయణ (Satyanarayana) పదవికి రాజీనామా (Resignation ) చేశారు. స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని (government) ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో రాజీనామా చేశారు. 2023 జూన్ లో టీజీ రెరా చైర్మన్ గా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు.రాజీనామాను ఆమోదిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ (Jayesh Ranjan) మెమో జారీచేశారు. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి







