బీఆర్ఎస్ నాయకులు .. తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా : రామచందర్ రావు
బీఆర్ఎస్ (BRS) కు చెందిన వందలాది మంది నాయకులు తమతో టచ్ లో ఉన్నారని, తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు (Ramchander Rao) వెల్లడించారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రామచందర్ రావు మీడియాతో బీఆర్ఎస్ వారిని నిలువరించేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలంగాణాలో బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు (MLAs) తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో కొనసాగిన తాము ఇప్పుడు ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) లక్ష్యంగా కేటీఆర్ (KTR) చేస్తున్న ఆరోపణలు చాలామందికి ఇష్టం లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు అని అన్నారు.
ఇవి కూడా చదవండి







