Janasena: జనసేన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించారుర. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడక వెళ్లారు. అనంతరం రోడ్డు పనులు పరిశీలించారు. జనసేన పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), అరకు పార్లమెంటు ఇంఛార్జి గంగులయ్య (Gangulayya), నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆరకులో ఉన్న గ్రామదర్శిని మహిళలతో కలిసి థింసా నృత్యం (Thimsa Dance) చేశారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







