చార్లెట్లో TTA యూత్ బాంక్వెట్.. జులై 17న సెలబ్రిటీలతో గ్రాండ్ ఈవెంట్
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘టీటీఏ మెగా కన్వెన్షన్ 2026’లో భాగంగా యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘యూత్ బాంక్వెట్’ (Youth Banquet) పోస్టర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. జులై 17 నుండి 19 వరకు చార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే ఈ మహాసభల తొలిరోజే రాత్రి 7:00 గంటల నుండి అర్ధరాత్రి 12:00 గంటల వరకు ఈ మెగా యూత్ ఈవెంట్ ఘనంగా జరగనుంది.
ఈ ప్రతిష్టాత్మక యూత్ బాంక్వెట్‌కు ప్రపంచ ప్రసిద్ధ ‘నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ్’ (NASCAR Hall of Fame) వేదిక కానుంది. యువతను విశేషంగా ఆకట్టుకునేలా వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో ఈ రాత్రిని ప్లాన్ చేశారు.
ఈవెంట్ వివరాలు..
వేదిక: NASCAR Hall of Fame, 400 E M.L.K. Jr Blvd, Charlotte, NC 28202.
ప్రధాన ఆకర్షణలు..
థ్రిల్లింగ్ నాస్కార్ సిమ్యులేషన్స్ & గేమ్స్, ప్రత్యేక సెలబ్రిటీ మీట్ అండ్ గ్రీట్, అదిరిపోయే మ్యూజిక్ & డాన్స్ ఫ్లోర్, అలాగే నోరూరించే ఆహార, పానీయాలు (Food & Drink).
అర్హత: ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు కనీస వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
టికెట్ ధర: ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద టికెట్ ధరను $50 గా నిర్ణయించారు. టికెట్లు పరిమితంగా ఉన్నందున ఆసక్తి గల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన స్పాన్సర్షిప్స్, విరాళాలు లేదా వాలంటీరింగ్గా సేవలందించాలనుకునే వారు ప్రణవి (704-606-4618) ను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.ttaconvention.org లేదా టీటీఏ హెల్ప్‌లైన్ 1-866-TTA-SEVA ను సంప్రదించాలని కోరారు.








