సైలెంట్‌గా వచ్చే దంత సమస్యలు.. ‘డాబర్ రెడ్ పేస్ట్‌తో చెక్ పెట్టండిలా
Red Paste: చాలా మంది పంటి నొప్పి భరించలేనంత తీవ్రంగా మారే వరకు దంత సమస్యలను గుర్తించకుండా అలాగే వదిలేస్తుంటారు. అయితే, ఇలా నోటి సమస్యలు లోలోపలే పెరిగి పెద్దదవడంపై దంత వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిప్పి పళ్ళు, చిగుళ్ళ వ్యాధుల వంటి అనేక సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి నొప్పి లేదా బయటకు కనిపించే లక్షణాలు లేకుండానే మొదలవుతాయి. ఈ కారణంగానే చాలా మంది డెంటిస్ట్‌ను కలవడాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. దీని వల్ల చిన్న సమస్యలే కాస్తా పెద్దవిగా మారి, పేషెంట్ గుర్తించే లోపే పళ్ళు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
ఇవి కూడా చదవండి
పళ్ళపై ఉండే జిగట పొర గట్టిపడి గారలాగా..
ఓరల్ హైజీన్‌ను (నోటి పరిశుభ్రతను) నిర్లక్ష్యం చేయడం వల్ల లోపల సమస్య ఎలా పెరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం రోజూ దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే, కేవలం కొన్ని రోజుల్లోనే పళ్ళపై ఉండే జిగట పొర కాస్తా గట్టిపడి గారలాగా మారుతుంది. ఈ గార ఒక్కసారి ఏర్పడితే, మనం మామూలుగా బ్రష్ చేయడం ద్వారా దానిని వదిలించలేము. ఇది చివరకు చిగుళ్ళ వాపునకు, పంటి పైపొర దెబ్బతినడానికి , పళ్ళు ఊడిపోవడానికి దారితీస్తుంది. పంటిలో ఎలాంటి నొప్పి లేనంత మాత్రాన పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పంటిలో నొప్పి లేదా ఇబ్బంది బయటకు తెలిసే సమయానికి, సమస్య అప్పటికే చాలా ముదిరిపోతుంది. దీనివల్ల చిన్నపాటి చికిత్సతో నయమయ్యే సమస్య కాస్తా.. ఎక్కువ ఖర్చుతో కూడిన పెద్ద ఆపరేషన్లు లేదా కష్టమైన ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన స్థితికి చేరుకుంటుంది.
ఆయుర్వేద మూలికలు..
ఈ దంత సమస్యల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, మన పెద్దల కాలం నాటి సహజ నివారణలను ఆధునిక విజ్ఞానంతో ముడిపెడుతూ నివారణా చర్యలపై ఇప్పుడు సరికొత్తగా దృష్టి పెడుతున్నారు. లవంగాలు , వేప వంటి ఆయుర్వేద మూలికలకు హానికరమైన బ్యాక్టీరియాను అరికట్టే , చిగుళ్ళ వాపును తగ్గించే గొప్ప శక్తి ఉన్నట్లు ఎప్పటి నుంచో నిరూపితమైంది. ప్రముఖ బ్రాండ్ డాబర్ రెడ్ పేస్ట్ (Dabur Red Paste) ఈ సాంప్రదాయ మూలికల గుణాలను క్లినికల్‌గా పరీక్షించిన తన రోజువారీ ఫార్ములాలో పొందుపరిచింది. ఈ పేస్ట్‌కు ఐడీఏ (IDA – ఇండియన్ డెంటల్ అసోసియేషన్) గుర్తింపు ముద్ర కూడా లభించింది. ఇది పళ్ళపై గార పట్టకుండా చేసి, తీవ్రమైన దంత సమస్యలు రాకుండా కాపాడటంలో సైంటిఫిక్‌గా నిరూపితమైన సాధనంగా ఎంతగానో సహాయపడుతుంది.
జాగ్రత్తలు..
దీర్ఘకాలం పాటు పళ్ళు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే సమస్య వచ్చాక చికిత్స చేయడం కంటే, రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ రెండు సార్లు డాబర్ రెడ్ పేస్ట్ వంటి గుర్తింపు పొందిన పేస్ట్‌తో పళ్ళు తోముకోవడం, ఫ్లోసింగ్ చేయడం (పళ్ళ మధ్య ఇరుక్కున్న మురికిని దారంతో శుభ్రం చేయడం) , తీపి పదార్థాలు తినడం తగ్గించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా, పళ్ళు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఈ రోజువారీ అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా దంత వైద్యుడిని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే, ఎలాంటి దంత సమస్యలైనా అవి ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తించి సులభంగా నయం చేయవచ్చు. ఇలా ముందే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన అందమైన చిరునవ్వును కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో వచ్చే శారీరక నొప్పులను, పంటి చికిత్సల కోసం అయ్యే భారీ ఖర్చులను తప్పించుకోవచ్చని ప్రముఖ ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ సోనియా దత్తా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







