పిల్లల కోసం ‘టిసిసి టాలీవుడ్ డ్యాన్స్ క్లాసెస్’.. అడ్మిషన్లు ప్రారంభించిన TAL
TAL: బ్రిటన్లోని ప్రసిద్ధ ప్రవాస తెలుగు సంస్థ ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్’ (TAL) తన సాంస్కృతిక విభాగమైన ‘తాల్ కల్చరల్ సెంటర్’ (TCC) ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ‘టాలీవుడ్ డ్యాన్స్ క్లాసెస్’ (Tollywood Dance Classes) ప్రారంభించింది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు సరదాగా ఆడుతూ పాడుతూ మన తెలుగు సంస్కృతిని నేర్చుకునేలా ఈ డ్యాన్స్ క్లాసులను రూపకల్పన చేశారు. ఈ క్లాసులలో శిక్షణ పొందిన పిల్లలకు భవిష్యత్తులో జరిగే ప్రతిష్టాత్మక ‘టాప్’ (TAL) అధికారిక వేడుకలలో ప్రదర్శనలు ఇచ్చే అద్భుతమైన అవకాశాలను కల్పించనున్నారు.
వేదిక..
ఈ డ్యాన్స్ శిక్షణా తరగతులను లండన్ , పరిసర ప్రాంతాలైన ఇల్ఫోర్డ్ (Ilford), బర్న్హామ్ (Burnham), ఫెల్తామ్ (Feltham) , అమర్షామ్ (Amersham) లలో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు (Ages 5+) గల పిల్లలు ఈ క్లాసులలో చేరడానికి అర్హులు. అన్ని సెంటర్లలోనూ పరిమిత సంఖ్యలోనే సీట్లు (Limited Places) అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల వారు తమ పిల్లల పేర్లను వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వహకులు కోరారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల కొరకు టాప్ అధికారిక వెబ్సైట్ https://taluk.org/tcc/ ని సందర్శించవచ్చు లేదా సంబంధిత క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేయవచ్చు.







