టీజీ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన ఎం. రుషి కలను నిజం చేసిన మెగాస్టార్ చిరంజీవి
తన ఉదారత, సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెలంగాణ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్ రెజోనెన్స్ జూనియర్ కాలేజీల విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా అభినందించారు.
రుషి సాధించిన ఈ అరుదైన విజయాన్ని గుర్తించిన చిరంజీవి గారు ఆమెను అభినందిస్తూ.. ఆమె కృషి, అంకితభావం, పట్టుదలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు.
మెగాస్టార్ చిరంజీవిని కలవడం రుషి చిన్ననాటి కల. మంచి ర్యాంక్ సాధిస్తే ఆ కల నిజమవుతుందని ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ కలను నిజం చేస్తూ చిరంజీవి గారు రుషి, ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలుసుకున్నారు. అంతేకాకుండా ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు.
రుషి ఇంజినీరింగ్ చదివి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యం పెట్టుకుందని తెలుసుకున్న చిరంజీవి గారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “ఏ సహాయం కావాలన్నా ఎలాంటి సంకోచం లేకుండా సంప్రదించండి. నన్ను కుటుంబ సభ్యుడిలా భావించండి. అమ్మాయి తన కలను నిజం చేసుకునేలా ప్రోత్సహించండి” అని రుషి తల్లిదండ్రులకు చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు నర్రా మాట్లాడుతూ.. “ఎం. రుషి సాధించిన విజయం కేవలం ఒక ర్యాంక్ మాత్రమే కాదు. ఇది చారిత్రాత్మక మైలురాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది గొప్ప స్ఫూర్తి. మా విద్యార్థిని ఈ అరుదైన విజయానికి మెగాస్టార్ చిరంజీవి గారు అభినందించడం మాకు ఎంతో గర్వకారణం” అన్నారు.

1986లో ప్రారంభమైన ఈఏఎంసెట్ పరీక్ష తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలలో ఒకటి. తర్వాత ఈఏపీసెట్‌గా మారిన ఈ పరీక్షలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా అగ్రస్థానాలు ఎక్కువగా అబ్బాయిలే సాధించారు. అలాంటి పరిస్థితిలో రెజోనెన్స్ జూనియర్ కాలేజీల విద్యార్థిని ఎం. రుషి తెలంగాణ ఈఏపీసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.
రుషి విజయం రెజోనెన్స్ జూనియర్ కాలేజీలు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి







