ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
* శ్రీ రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవంతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవంలో పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నాను
* కేవలం ఓ ముఖ్యమంత్రిగానే ఇక్కడికి రాలేదు. ఓ భారతీయుడిగా, గురూజీ బోధనల్ని అనుసరిస్తున్న వ్యక్తిగా ఇక్కడికి వచ్చాను
* ఆయన కేవలం ఓ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదు శాంతిసామరస్యాలను చాటిచెప్పే ప్రపంచ మానవుడు
* ప్రాచీన భారతీయ విజ్ఞానానికి ఆధునిక ప్రపంచానికి వారధిగా శ్రీరవిశంకర్ గురూజీ వ్యవహరిస్తున్నారు
* హింసలేని సమాజం-ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని సాధించాలని దశాబ్దాలుగా బోధిస్తూ మానవాళికి గొప్పసేవ చేస్తున్నారు
* యుద్ధాలతో శాంతికి దూరమైన సమాజాన్ని, అనిశ్చితి నుంచి బయట పడేసేలా మానవత్వం అనే అత్యుత్తమ మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు
* యుద్ధక్షేత్రాల నుంచి ట్రాన్స్ ఫర్మేటివ్ పవర్, డైలాగ్, ఇన్నర్ స్ట్రెంత్ అనే విధానాలను అనుసరించారు
* గ్రామాల నుంచి అంతర్జాతీయ స్థాయి సంస్థల వరకూ, అనిశ్చితి నెలకొన్న కొలంబియా ప్రాంతాల వరకూ చర్చలు అనే శాంతి మార్గం ద్వారా మార్పులు తెచ్చారు.
* సామాన్య ప్రజలతో పాటు అంతర్జాతీయ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకున్న ఆధ్యాత్మిక వేత్త శ్రీ రవిశంకర్ గురూజీ
* 45 ఏళ్లక్రితం హ్యాపీ హ్యూమన్ బీయింగ్, స్ట్రెస్ ఫ్రీ సొసైటీ బెటర్ వరల్డ్ అనే విజన్ తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోట్లాది మందికి ప్రేరణగా నిలిచింది
* సురక్షిత తాగునీరు, రివర్ రిజునవేషన్, మహిళా స్వయం సమృద్ది, విలువలతో కూడిన విద్య లాంటి రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను అభినందిస్తున్నాను
* ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
* భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. సామాన్య ప్రజల జీవితాలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోను అవుతోంది.
* గ్యాస్, ఇంధనం లాంటి వనరుల మార్కెట్ లభ్యత ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ సమయంలో ఒత్తిడిని ఎదుర్కోని సమర్ధంగా జీవించాల్సిన అవశ్యకత ఉంది.
* ఇలాంటి సమయంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు మానవాళికి అత్యు్త్తమ సేవలు అందించాలని కోరుతున్నాను.
* ప్రధాని మోదీ లాంటి సమర్ధవంతమైన నేత దేశానికి నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రగామిగా మారుతుంది
* వేల ఏళ్ల క్రితం వరకూ మానవాళిని నడిపించిన నేల ఇది. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన దేశం మనది.
* ఆధునిక జీవనంలో శాంతిని సాధించేలా శ్రీ రవిశంకర్ గురూజీ తన బోధనలతో ప్రభావితం చేశారు.
* సంస్కృతితో మిళితమైన ఆధునికత, విలువలతో కూడిన జీవనం లాంటి ఎన్నో అంశాల ద్వారా తన బోధనల్ని సాగిస్తున్నారు
* గతంలో మేం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా తరగతులు నిర్వహించాం
* కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన నేల నుంచి నేను వచ్చాను. ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైన తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారు.

* శ్రీశైలం, ఆహోబిలం, అన్నవరం, సింహాచలం లాంటి అధ్యాత్మిక క్షేత్రాలు నిండిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
* ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో నిర్మిస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.
* ఆభివృద్ధి అంటే కేవలం ఆర్ధిక ప్రగతి, టెక్నాలజీ మాత్రమే కాదు ప్రజల జీవన ప్రమాణాలు మార్చటమేనని నేను భావిస్తున్నాను
* ప్రతీ పౌరుడూ శాంతి సౌఖ్యాలు, ఆనందంగా జీవించాలన్నదే నా అభిప్రాయం. ఏపీ సమీకృత అభివృద్ధి సాధించాలన్నదే నా లక్ష్యం కూడా.
* ఏపీలోని ప్రతీ పౌరుడికీ అత్యుత్తమ జీవన ప్రమాణాలు కల్పించేలా సంకల్పం తీసుకున్నాం. అందుకే పీ4 లాంటి కార్యక్రమాలు చేపట్టాం
* అందుకే స్వర్ణాంధ్ర 2047 విజన్ కూడా అమలు చేశాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని తయారు చేయటమే నా లక్ష్యం
* సాంకేతికత సాయంతో ఏపీని గ్లోబల్ ఎకానమీలో ఓ కీలకమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం
* అదే సమయంలో ఎలాంటి ఒత్తిడి లేని సమాజాన్ని కూడా తీసుకురావాలి. విధానకర్తగా మేం అభివృద్ధి వైపుగానే ఆలోచన చేయగలం
* స్పేస్, డ్రోన్, డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు అవుతున్నాయి. మొదటి క్వాంటం కంప్యూటర్ ఏపీలో ఏర్పాటు అవుతోంది
* పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాం
* ఇంత అభివృద్ధి సాధిస్తున్నా ప్రజల్లో శాంతి సౌఖ్యాలు రావాలంటే ఆధ్యాత్మికత అవసరం.
* దీనికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు ఏపీలో పనిచేయాలి. ఏపీ ఈ విలువలను మేం ప్రపంచానికి చాటి చెబుతామని హామీ ఇస్తున్నాను.








