అట్లాంటాలో 20టీములతో ఆసక్తిగా సాగిన తానా వాలీబాల్ టోర్నమెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో మే 16, 2026న జార్జియాలోని రోస్వెల్లో ఉన్న డాన్ వైట్ మెమోరియల్ పార్క్‌లో తానా అట్లాంటా వాలీబాల్ టోర్నమెంట్‌కు కమ్యూనిటీ నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ టోర్నమెంట్ లో 20 టీమ్ లు ఉత్సాహంగా పాల్గొనడంతోపాటు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆడటం అందరినీ ఆకట్టుకుంది.
ఈ టోర్నమెంట్లో హైలైట్ గా నిలిచిన అంశం… 10 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఒక టీమ్ గా నిలిచి, అనుభవజ్ఞులైన జట్లతో తలపడటం విశేషంగా ఆకట్టుకుంది. వారి ఆత్మవిశ్వాసం, సమష్టి కృషి మరియు పోటీతత్వం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ వారి ఆటను ఆసక్తిగా తిలకించేలా చేసింది. ఈ టోర్నమెంట్‌ను ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన నిర్వాహకులు, వాలంటీర్లు, ఆటగాళ్లు, స్పాన్సర్లు మరియు వీక్షకులకు తానా నాయకత్వం తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ టోర్నమెంట్ నిర్వహణలో తమను ప్రోత్సహించడంతోపాటు, మద్దతును అందించిన తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీని లావుకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ టోర్నమెంట్‌ను నరేన్ నల్లూరి చక్కటి సమన్వయంతో అద్భుతంగా నిర్వహించారు. తానా రీజినల్ రిప్రజెంటేటివి శేఖర్ బి కొల్లు, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భరత్ మద్దినేని, సునీల్ దేవరపల్లి (సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్) ఈ టోర్నమెంట్ విజయవంతానికి సహకరించారు. స్థానిక తానా నాయకులు శ్రీనివాస్ ఉప్పు, వినయ్ మద్దినేని, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, కోటి కందిమల్ల, చైతన్య కొర్రపాటి, బాబీ, కార్తీక్ గుమ్మడి, శ్రీ హర్ష యెర్నేని, మరియు శివ నాగ తదితరులు కూడా ఈ టోర్నమెంట్ విజయానికి కృషి చేశారు.
విజేతలు-రన్నరప్ జట్లు
ఛాంపియన్స్ లీగ్ డివిజన్ పోటీల్లో విజేతగా అట్లాంటా స్పైకర్స్ (కెప్టెన్ జాకబ్) నిలిచారు. రన్నరప్ ఫీల్డ్స్టోన్ (కెప్టెన్ అరవింద్) టీమ్, మూడో స్థానంలో హిట్మెన్ (కెప్టెన్ కార్తీక్ గుమ్మడి) టీమ్ నిలిచింది.
ప్రీమియర్ లీగ్ డివిజన్ పోటీల్లో విజేతగా టిఎన్టి (కెప్టెన్ రామ్‌జీ) నిలిచింది. రన్నరప్ గా ఈజీపాస్ 2 (కెప్టెన్ బాల్కి) టీమ్, మూడో స్థానంలో గద్దె క్యాపిటల్స్ (కెప్టెన్ మథన్) నిలిచింది.
ఈ ఈవెంట్ లైవ్ ఆన్లైన్ కవరేజ్ మరియు రియల్ టైమ్ టోర్నమెంట్ అప్డేట్లను బాబీ ముఖర్జీ వేములపల్లి చక్కగా నిర్వహించారు. ఈ కమ్యూనిటీ కార్యక్రమానికి అండగా నిలిచి, క్రీడలను ప్రోత్సహించిన మా స్పాన్సర్లు మురళి సుంకర (విపిఆర్ రియల్టర్), సంకీర్త్ పడాల (గూస్హెడ్ ఇన్సూరెన్స్), బాబీ (జిపిఎస్ కిడ్స్), సాయిబాబు మద్దినేని (ఫైనాన్షియల్ అండ్ మార్ట్గేజ్ ఎక్స్పర్ట్), మరియు దేశీ డిస్ట్రిక్ట్ లకి హృదయపూర్వక ధన్యవాదాలను నిర్వాహకులు తెలియజేశారు.







