మేరీల్యాండ్ లో వసంత కృష్ణ ప్రసాద్ తో ఆత్మీయ సమావేశం
మేరీల్యాండ్ లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని అన్నారు. పోలవరం తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోతుంది. ప్రవాస తెలుగు వారు మాతృభూమి మాతృభాష తెలుగును మర్చిపోకుండా మన సంస్కృతిని కాపాడుకుంటూ, ఏదేశంలో ఉన్నా ఆదేశ చట్టాలను గౌరవిస్తూ ఉత్తమ ప్రమాణాల పౌర జీవనంతో కలిసి మెలిసి గౌరవ ప్రదంగా, కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలి. పెద్దల అనుభవం, యువతరం సాంకేతిక విజ్ఞానంతో ముందుకు సాగాలి.


మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్థాపించిన నాలుగున్నర దశాబ్దాల తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆస్తి, అస్తిత్వంగా మరో శతాబ్దకాలం నిలవాలి. రాజకీయాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి నాయకత్వంలో యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి. తెలుగు వారి కీర్తి దశదిశలా వెలగాలి.
ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, చల్లా ప్రభాకర్, నూతక్కి రమేశ్, శ్రీనివాస్ దామా, శివనాగ మహేశ్ నెలకుదిటి, సతీశ్ సూదిరెడ్డి, శివ నెల్లూరి, పైడి శ్రీనివాసరావు, హర్ష పేరంనేని తదితరులు ప్రసంగించారు. పర్సిస్ ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.







