టీఎంసీలో చీలిక… కీలక సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేల డుమ్మా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. బీజేపీ విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో ఓటమి ద్వారా తృణమూల్ లో పెద్ద చీలిక వస్తుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే రీపోలింగ్ బరిలోంచి టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా మమతా బెనర్జీకి షాక్ కి గురి చేసింది. తానపై ఒత్తిడేమీ లేదని, తన సొంత నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. తాను ఫాల్తా మట్టి బిడ్డనని, అభివృద్ధి కోసం ఓ ప్రత్యేక ప్యాకేజీని కూడా సీఎం ప్రకటించారని, అందుకే వైదొలుగుతున్నానని ప్రకటించారు.
అయితే.. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మొదటి సారిగా టీఎంసీ తొలి భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు రాలేదు. 80 మంది ఎమ్మెల్యేలు వుంటే.. కేవలం 35 మంది మాత్రమే హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తీవ్ర విభేదాలు వున్నాయని స్పష్టమైపోతోంది. అంతేకాకుండా హాజరు కాని ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.







