మే 23న ఎడిసన్‌లో ‘నాట్స్’ ఉచిత వైద్య శిబిరం.. వారికి సువర్ణావకాశం
అమెరికాలోని ప్రవాస తెలుగు వారి ప్రముఖ సేవా సంస్థ ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం‘(NATS), ‘సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ న్యూజెర్సీ’ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు, పురుషులు వృద్ధుల కోసం ఒక భారీ ఉచిత వైద్య శిబిరాన్ని (Medical Camp) ఏర్పాటు చేశారు. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో 2026 మే 23వ తేదీ శనివారం నాడు ఈ కార్యక్రమం జరగనుంది. స్థానిక ప్రవాస తెలుగు ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా “భాషే రమ్యం… సేవే గమ్యం” అనే నినాదంతో నాట్స్ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి
వైద్య శిబిరం ప్రధాన వివరాలు:
తేదీ: మే 23, 2026 (శనివారం)
సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు (EST)
వేదిక: SDP SSVT NJ, 1665 ఓక్ట్రీ రోడ్ (Oaktree Rd), సూట్ #370, ఎడిసన్, న్యూజెర్సీ (NJ 08080), అమెరికా.
ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు ఇస్తారు:
డాక్టర్ జనార్ధన్ బొల్లు, MD: ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ (Gastroenterology) నిపుణులు.
డాక్టర్ స్మిత, MD: ప్రముఖ ఫ్యామిలీ మెడిసిన్ (Family Medicine) నిపుణులు.
బీనా లోపెజ్ (Beena Lopez): FNP-BC నిపుణులు.
వైద్య శిబిరానికి సంబంధించిన పూర్తి వివరాలు లేదా రిజిస్ట్రేషన్ల కోసం కింది ప్రతినిధులను సంప్రదించవచ్చు:
మురళీకృష్ణ మేడిచర్ల: 973-670-0578
బిందు యలమంచిలి: 908-240-3167
కిరణ్ మందాడి: 732-491-1776
శ్రీనివాస్ మెంతా: 908-230-5390
ఈ హెల్త్ క్యాంప్‌ను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ల పర్యవేక్షణలో.. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BOD), ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC), న్యూజెర్సీ చాప్టర్ టీమ్ న్యూజెర్సీ చాప్టర్ అడ్వైజరీ టీమ్ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు వారు ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ ప్రతినిధులు కోరారు. ఏదైనా అత్యవసర సమాచారం కోసం నాట్స్ హెల్ప్‌లైన్ నంబర్లు +1-888-4-TELUGU లేదా +1-888-483-5848 ద్వారా సంప్రదించవచ్చు.







