యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశం.. ఆటా, జీ5 టీవీల ఆధ్వర్యంలో భారీ స్టార్టప్ పోటీ త్వరలో!
అమెరికాలోని ప్రవాస తెలుగు వారి ప్రముఖ సంస్థ ‘అమెరికా తెలుగు సంఘం‘ (ATA), ప్రముఖ ఓటీటీ, టీవీ ప్లాట్‌ఫారమ్ ‘జీ5 టీవీ’ (ZEE5 TV) సంయుక్తంగా సరికొత్త వ్యాపార ఆలోచనలతో దూసుకుపోతున్న యువ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రతిష్టాత్మక వేదికను సిద్ధం చేశాయి. “ఐడియా బాజ్ స్టార్టప్ కాంపిటీషన్” (Start-Up Competition – Idea Baaz) పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీ, తమ స్టార్టప్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని భావించే వారికి ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. “పెట్టుబడి – ఆశయం కలిసే చోటు” (Where Capital Meets Ambition) అనే నినాదంతో ఈ పోటీలను డిజైన్ చేశారు.
పోటీ ప్రయోజనాలు:
పాల్గొనే స్టార్టప్‌లకు 1 బిలియన్ డాలర్లకు పైగా వెంచర్ క్యాపిటల్ (VC) ఫండ్స్ పొందే అవకాశం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
50 మందికి పైగా ప్రఖ్యాతి గాంచిన బిజినెస్ మెంటార్ల ద్వారా వ్యూహాత్మక సలహాలు అందుతాయి.
ప్రతిభ కనబరిచిన టాప్ 3 స్టార్టప్‌లకు జీ5 టీవీ ‘ఐడియా బాజ్ సీజన్ 2’ షోకేస్‌లో ఫీచర్ అయ్యే ప్రత్యేక అవకాశం దక్కుతుంది.
ముఖ్యమైన తేదీలు…
దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2026
దరఖాస్తుల పరిశీలన (Review): జూన్ 1 నుండి జూన్ 19, 2026 వరకు
ప్రిపరేషన్ వీక్ (Prep Week): జూన్ 20 నుండి జూన్ 26, 2026 వరకు
పిచ్ డేస్ (Pitch Days): జూన్ 27 నుండి జూలై 10, 2026 వరకు
గ్రాండ్ ఫినాలే పిచ్ డే: ఆగస్టు 2, 2026
వేదిక: బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్, బాల్టిమోర్, మేరీల్యాండ్ (MD), అమెరికా.
అర్హతలివే..
ఈ పోటీలలో పాల్గొనడానికి స్టార్టప్ ప్రధాన కార్యాలయం (HQ) అమెరికాలో ఉండాలి. ప్రీ-సీడ్ నుండి సిరీస్ A స్థాయిలో ఉంటూ, 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు, 5 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వార్షిక ఆదాయం (ARR) ఉన్న 500కి పైగా స్టార్టప్‌లు, 20 కి పైగా వీసీ ఫార్మ్‌లు ఈ రేసులో పాల్గొననున్నాయి. వీరి నుండి 15 మంది ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు. ముఖ్యంగా ఏఐ అండ్ డీప్‌టెక్ (AI & DeepTech), ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, రిటైల్/కన్స్యూమర్/CPG, సాస్(SaaS), క్లైమేట్ వంటి రంగాలలోని స్టార్టప్‌లకు ఈ పోటీలలో ప్రాధాన్యత ఉంటుంది.
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఏరో విల్లాస్, పవర్‌హౌస్ వెంచర్స్, సోమిరెడ్డి లా గ్రూప్, మెరిల్ వంటి సంస్థలు కార్పొరేట్ డైమండ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆసక్తి గల యువ పారిశ్రామికవేత్తలు అధికారిక లింక్ ideabaazcontest.com ద్వారా లేదా పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి మే 31 లోగా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆటా అధికారిక వెబ్సైట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సంప్రదించవచ్చని నిర్వాహక బృందం తెలిపింది.







