ఐదు దేశాల పర్యటనల సందర్భంగా ఆయా దేశాధినేతలకు మోదీ ఇచ్చిన గిఫ్ట్ లు ఇవే..
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో పర్యటించారు. తిరిగి భారత్ కి చేరుకున్నారు. అయితే ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల సందర్భంగా ఆయా దేశాధినేతలకు కొన్ని గిఫ్ట్ లు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. గతంలో కొందరికి భగవద్గీత బహూకరించేవారు. తాజాగా.. విదేశీ పర్యటనల సందర్భంగా పీఎం మోదీ భారత సంస్కృతి ఉట్టిపడేలా విదేశీ నేతలకు బహుమతులు అందజేశారు.
1.ఇటలీ అధ్యక్షుడు సెర్గియోకి పండిట్ భీమ్ సేన్ జోషి, ఎంఎస్ సుబ్బులక్ష్మీ పాటల సీడీలను బహుమతిగా ఇచ్చారు. తెల్లని పాలరాయితో ఈ బాక్స్ ను తయారు చేశారు. మాలకైట్, పగడం వంటి రాళ్లను అలంకరించారు.
2. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అసోంలో ప్రాముఖ్యత కలిగిన ముగా సిల్క్ శాలువాను ఇచ్చారు.ఈ శాలువాను గోల్డెన్ సిల్క్ అని పిలుస్తారు.
3. యూఏఈ రాణి షేఖా ఫాతిమాకి తెలంగాణలోని కరీంనగర్ కి చెందిన ఫిలగ్రీ పెట్టె, మహారాష్ట్రకు చెందని పట్టు వస్త్రం బహూకరించారు.
4. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిజ్ జాయోద్ కి గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన రోగన్ పెయింటింగ్ తో పాటు గుజరాత్ లో ప్రసిద్ధమైన కేసరీ మామిడి పండ్లు, మేఘాలయాకు చెందిన పైనాపిల్ ఇచ్చారు.
5. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ కి సిక్కిం లోయ నుంచి సేకరించిన ఆర్కిడ్ పెయింటింగ్, ఆర్కిడ్ పేపర్ వెయిట్ ఇచ్చారు.
6. నార్వే రాణి సోంజాకి ఒడిశాకి చెందిన తాళపత్ర చిత్రం ఇచ్చారు.
7. నార్వే యువరాజుకి ఏపీకి చెందిన కళంకారితో డిజైన్ చేసిన సూర్యచంద్రుల ఆకృతిలో వున్న చిత్రపటాన్ని ఇచ్చారు.
8. నెదర్లాండ్స్ రాజు విల్లెం అలెగ్జాండర్ కి రాజస్థాన్ లోని జైపూర్ లో ఫేమస్ అయిన పూలకుండీలు, రాణి మాక్సిమాకి కుందన్ చెవి పోగులు ఇచ్చారు.
9. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ కి మధుబనితో డిజైన్ చేసిన చేపల ఆకృతి చిత్రపటం, ప్రధానికి బిద్రి వెండి పూలకుండీ బహూకరించారు.
10. ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ కి భారత్ లో పండిన పలు రకాల ధాన్యాలు, మహారాష్ట్రలో ఫేమస్ అయిన మిలెట్ బార్స్ బహూకరించారు.
ఇవి కూడా చదవండి







