నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ‘‘కొందరికి ‘‘ఫేర్ వెల్?
నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యంత కీలకమైన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి కేవలం కేబినెట్ హోదా వున్న మంత్రులే కాకుండా సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు కూడా హాజరవుతున్నారు. 36 మంది సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన 5గురు… ఇలా మొత్తం 72 మందితో ఈ కేబినెట్ భేటీ జరగనుంది.
అయితే… ప్రతి వారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం వుంటుంది. అందులో ఆయా శాఖల పనితీరు, కీలక నిర్ణయాలు, తీసుకుంటారు. కానీ… ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతతో కూడిందని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో, ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంపై దేశం నలుమూలల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, తీసుకున్న కీలక నిర్ణయాలు వాటి ఫలితాలు, అలాగే భవిష్యత్ ప్రణాళికలతో సహా పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
మంత్రివర్గ సమావేశం సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖల పనితీరు, ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలు చర్చకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరు, సాధించిన విజయాలపై సమీక్ష చేయనున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, ఆ కారణంగా ఆర్థికంగా మనదేశమ్మీద పడిన ప్రభావంపై చర్చించనున్నారు. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం ప్రజలపై అతి తక్కువగా పడేలా ఏమేం చేయొచ్చు? అన్న విషయమ్మీద మంత్రులు, విభాగాలకు మోదీ దిశానిర్దేశం చేయనునన్నట్లు తెలిసింది.
మోదీ ప్రభుత్వ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాల నడుమ, ప్రస్తుతం మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. ఇదే చివరి ఫేర్ వెల్ సమావేశం అని, ఈ కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వుంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి.
మోదీ వరుసగా మూడో సారి పీఎం బాధ్యతలు స్వీకరించారు. జూన్ 10,2024న ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత జరగలేదు. ఇప్పుడు కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించి, ఈ టీమ్ తోనే ఎన్నికలకు వెళ్లాలని కూడా మోదీ నిర్ణయించినట్లు అంటున్నారు.
ఇవి కూడా చదవండి







