త్వరలో ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ..ట్రంప్ చతురోక్తులు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో ఇజ్రాయెల్ ప్రధానిగా పోటీ చేస్తారా..? అంటే బెంజమిన్ నెతన్యాహుతో ఎన్నికల్లో తలపడతారా..? తాజాగా ట్రంప్ తనదైన శైలిలో చతురోక్తులు పండించారు. తన అధ్యక్ష పదవీ కాలం ముగిసిన అనంతరం అక్కడ ప్రధాని పదవికి కూడా పోటీ చేయొచ్చని చమత్కరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధంపై ఇరాన్‌తో ఒప్పందానికి వచ్చే విషయంలో ఎలాంటి తొందర లేదన్నారు.
బెంజమిన్ నెతన్యాహు చాలా మంచి వ్యక్తి.. తాను కోరుకున్నది ఏదైనా చేస్తారని తెలిపారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు (Benjamin Netanyahu)ను సరిగా ట్రీట్ చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదరకుంటే త్వరలోనే ఇరాన్‌పై విరుచుకుపడతామని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ఇరాన్ (Iran) సాయుధ దళాలు కాల్పుల విరమణ సమయాన్ని తమ శక్తిసామర్థ్యాలను పునరుద్ధరించుకునేందుకు వినియోగించుకున్నాయని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు సైన్యంపై భరోసా కలిగి ఉండాలన్నారు. మరో యుద్ధానికి తెరలేపేలా శత్రువు (అమెరికా) కదలికలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అదే జరిగితే దాడి చేసినవారు పశ్చాత్తాపపడేలా చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి







