సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో లాహోర్..!
మత చాందసవాద దేశం పాకిస్తాన్ లో సరికొత్త ప్రయత్నం మొదలైంది. మతమార్పిళ్లతో మైనార్టీలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈదేశంలో.. ఇప్పుడు సాంస్కృతిక వారసత్వం పరిరక్షణపైనా ఫోకస్ పెరిగింది.మరీ ముఖ్యంగా లాహోర్ లో ఈ ప్రయత్నం పట్టాలెక్కుతోంది పాకిస్తాన్ లోని. పంజాబ్ ప్రభుత్వం ‘లాహోర్ వారసత్వ ప్రాంత పునరుద్ధరణ (ఎల్హెచ్ఏఆర్)’ పేరుతో ఈ పేర్ల మార్పును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది.
లాహోర్ నగరంలో పలు వీధులు, రోడ్లు, గల్లీలకు పాత పేర్లను పాకిస్థాన్ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా అక్కడి రెహ్మాన్ గల్లీ పేరును రామ్ గల్లీగా తిరిగి మార్చేసింది. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్‌ను లక్ష్మీ చౌక్‌గా మార్చింది. వారసత్వ సంస్కృతిని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా లాహోర్‌లో పాత పేర్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే- ప్రత్యేక దేశంగా అవతరించినప్పటి నుంచీ పాక్‌లో మైనార్టీలపై (ముఖ్యంగా హిందువులు, సిక్కులపై) దాడులు, బలవంతపు మత మార్పిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దెబ్బతింది.
మత ఛాందసవాద దేశంగా ఉన్న ముద్రను తొలగించుకుంటేనే ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) వంటి సంస్థల ఆంక్షలు తమపై తగ్గుతాయని, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థల నుంచి ఆర్థిక ప్యాకేజీలు సులువుగా అందుతాయని పాక్ భావిస్తోంది. లాహోర్‌లో పాత పేర్ల పునరుద్ధరణ ఈ ప్రణాళికల్లో భాగమే.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ‘లాహోర్ వారసత్వ ప్రాంత పునరుద్ధరణ (ఎల్హెచ్ఏఆర్)’ పేరుతో ఈ పేర్ల మార్పును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. సున్నత్ నగర్‌ను సంత్ నగర్‌గా, ముస్తాఫాబాద్ను ధరమ్పురగా, ఇస్లామాపురను క్రిషన్ నగర్‌గా మరియం సర్కారు తిరిగి మార్చింది.
ఇవి కూడా చదవండి







