సిందూర్ పై పాకిస్తాన్ వి బడాయి మాటలే.. తేల్చేసినా అమెరికా నివేదిక..!
ఆపరేషన్ సిందూర్ దెబ్బతో పాక్ అతలాకులతమైంది. ఈ ఆపరేషన్ మరో వారం రోజులు సాగితే .. పాక్ త్రివిదదళాలు నామరూపాల్లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.మరోవైపు.. ఉగ్రతండాలపై భారత మిస్సైల్స్ నిప్పులు కక్కుతున్నాయి. దానికి వారు తాళలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో ఎలాగైనా ఆపరేషన్ సిందూర్ ఆపాలంటూ పాకిస్తాన్ ప్రయత్నించింది. దీనికి అమెరికా సాయం తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ మాట అన్నది ఎవరో కాదు..యూఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద దాఖలైన ఫైలింగ్స్‌లో వెల్లడైంది. రక్షణ, ఆర్థికశాఖ అధికారులు, జర్నలిస్టులతో పాక్ లాబీ సంస్థలు 60 సార్లకు పైగా భేటీ అయినట్లు పేర్కొంది.
కాల్పుల విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ప్రయత్నాలు చేసిందని, ప్రాంతీయ శాంతి కోసం పాక్ ఆ అభ్యర్థనలను అంగీకరించిందని ఆదివారం రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆసిమ్ మునీర్ (Asim Munir) ప్రకటించారు. అవి డొల్లే అని ఈ నివేదిక తేట తెల్లం చేసింది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఒట్టి మాటలేనని ప్రపంచానికి మరోసారి అర్థమైంది.
ఇవి కూడా చదవండి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను చేపట్టింది. ఉగ్రస్థావరాలను మన సైన్యం నేలమట్టం చేసింది. ఆ సమయంలో వాషింగ్టన్‌లోని కీలక నేతలు, అధికారులతో పాక్ హడావుడిగా చర్చలు జరిపింది. మే 6 అర్ధరాత్రి భారత్ దాడుల ధాటికి కంగుతిన్న పాక్ 30సార్లు వేర్వేరుగా సంప్రదింపులు చేపట్టింది. అమెరికా నేతలతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఇక మే 7, 8న తమ ప్రాంతంలో ఉద్రిక్తతలపై చర్చించేందుకు లాబీయింగ్ చేసిందని రికార్డులు వెల్లడించాయి. మే 9న లాబీయింగ్‌ను మరింత పెంచింది. రక్షణ, జాతీయ భద్రతకు చెందిన వ్యక్తులతో 20 నుంచి 25 సార్లు సంప్రదింపులు చేపట్టింది. అమెరికా మీడియాలోని ప్రముఖ జర్నలిస్టులతోనూ పాక్ లాబీ సంస్థలు భేటీ అయ్యాయి.
వాషింగ్టన్లో భారత్, పాకిస్థాన్ కార్యకలాపాలకు పూర్తి వ్యత్యాసం కనిపించిందని ఆ ఫైలింగ్స్ ద్వారా వెల్లడవుతోంది. ఉగ్రవాదాన్ని ఖండించడం పైనా, పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం పైనా భారత్ సంప్రదింపులు చేపట్టింది. ఇదిలాఉంటే.. పాకిస్థాన్ (Pakistan)తో ఉద్రిక్తతల విషయంలో భారత్ తొలి నుంచి మూడో పక్షం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కంగుతిన్న పాక్ చివరకు కాళ్లబేరానికి రావడంతో మన ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి






