బంగారం కొనుగోళ్లకు దూరంగా వుండాలని ఎందుకు చెప్పారు?
ప్రస్తుత పరిస్థితుల్లో యేడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా వుండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.దీని ద్వారా విదేశీ మారకం నిల్వలను భారీగా ఆదా చేయవచ్చని చెప్పుకొచ్చారు. అయితే.. అందరి దృష్టీ ని ఆకర్షించారు. అయితే.. ముడి చమురును మనం ఇతర దేశాల నుంచి ఎలాగైతే దిగుమతి చేసుకుంటున్నామో, బంగారం కూడా అలాగే దిగుమతి అవుతోంది. యేడాదికి దాదాపు 700 టన్నుల బంగారాన్ని వినియోగిస్తుంటే.. అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది చాలా తక్కువే.అంతేకాకుండా దీనికి అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. మనం ఎంత ఎక్కువగా దిగుమతి చేసుకుంటే మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీంతో డాలర్ డిమాండ్ పెరిగి, భారత రూపాయి విలువ పడిపోతుంది. అయితే.. బంగారం దిగుమతులు బాగా పెరిగినప్పుడు నియంత్రించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టాయి. బంగారంపై విధించే సుంకాలను భారీగా పెంచేవి. దిగుమతులపై ఆంక్షలు కూడా పెట్టేవి.






