పెట్టుబడి దారుల కోసం యూకే ప్రత్యేక వీసా..!
సంపన్నుల కోసం ప్రపంచదేశాలు తమ దేశం తలుపులు బార్లా తీస్తున్నాయి. ప్రత్యేకంగా తమదేశంలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్నవారి కోసం.. ప్రత్యేకంగా వీసాలు అందిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ గోల్డెన్ కార్డును అమెరికా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు బ్రిటన్ సైతం అదే రూట్ లో పయనిస్తోంది. తమదేశంలో పెట్టుబడులు పెట్టేవారికి గానూ ఇన్వెస్టర్ వీసా లాంటి దాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది బ్రిటన్ సర్కార్..
విదేశీ పెట్టుబడిదారుల కోసం బ్రిటన్ కొత్త వీసా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా సంపన్న వర్గాల కోసం ఇన్వైట్ ఓన్లీ ఇన్వెస్టర్ వీసాను ఇచ్చే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో కనీసం 5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.64 కోట్లు) పెట్టుబడి పెడితే నివాస హోదా పొందవచ్చు. తద్వారా మూడేళ్ల పాటు బ్రిటన్లో నివసించే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత శాశ్వత నివాసానికీ మార్గం సుగమం అవుతుంది.
ఈ ప్రణాళికపై అభిప్రాయాన్ని సేకరించేందుకు పెట్టుబడి సలహాదారులకు యూకే ప్రభుత్వం సంబంధిత ప్రతిపాదనను పంపించినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు దోహదపడే పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకొని దీన్ని ప్రవేశపెట్టే యోచనలో స్థానిక ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొంది. 2022లో రద్దు చేసిన ఇన్వెస్టర్ వీసాకు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకురానున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి







