చెన్నై సూపర్ కింగ్స్.. ‘డూ ఆర్ డై’ పోరు..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ లీగ్ దశ ముగింపునకు వస్తున్న తరుణంలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు తెరలేచింది. టోర్నమెంట్లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే గుజరాత్ క్వాలిఫై కాగా.. చెన్నైకి లీగ్ స్టేజ్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడం, ప్లేఆఫ్స్ స్థానాలను ఖరారు చేసుకునేందుకు ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కావడంతో క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. అయితే, నేటి మ్యాచ్‌లో చెన్నైపై భారీ విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో ‘టాప్-2’ స్థానంలో నిలిచి, క్వాలిఫైయర్-1 ఆడే అదనపు అవకాశాన్ని దక్కించుకోవాలని జీటీ పట్టుదలతో ఉంది. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌గా మారింది. గత కొన్ని మ్యాచ్‌ల్లో వరుస ఓటములతో వెనుకబడిన సిఎస్కె.. ప్లేఆఫ్స్ రేసులో సజీవంగా నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గుజరాత్‌పై ఖచ్చితంగా భారీ రన్ రేట్‌తో విజయం సాధించాల్సిందే.
ఐపీఎల్ చరిత్రలో ఇరుజట్ల హెడ్-టు-హెడ్ రికార్డులను పరిశీలిస్తే ఇరు జట్లూ సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 9 సార్లు తలపడగా.. గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో, చెన్నై 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ 2026 సీజన్ లోనే గతంలో జరిగిన మొదటి ఫేస్ మ్యాచ్‌లో చెన్నై హోమ్ గ్రౌండ్ చెపాక్‌లోనే గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో సిఎస్‌కెకు గట్టి షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ 87 పరుగులతో చెలరేగగా, కాగిసో రబడా 3 వికెట్లతో చెన్నైని దెబ్బకొట్టాడు.
ఇవి కూడా చదవండి







