లక్నో సూపర్ జెయింట్స్ లోకి వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్లో(IPL) సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) భవిష్యత్తుపై సరికొత్త ప్రచారం మొదలైంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకాతో వైభవ్ ప్రత్యేకంగా మాట్లాడటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కొందరు యువ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ వద్దకు సంజీవ్ గోయెంకా వెళ్లడం, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ క్రేజీ మూమెంట్‌ను లైవ్‌లో చూసిన లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్ బాక్స్‌లో కూర్చొని తెగ మురిసిపోయారు. వచ్చే ఐపీఎల్ వేలంలో సూర్యవంశీని దక్కించుకోవడానికి లక్నో టీమ్ గట్టిగానే ప్రయత్నించేలా ఉందంటూ గవాస్కర్ చమత్కరించారు.
ఇవి కూడా చదవండి
“నేను త్వరలోనే నీ కోసం బిడ్డింగ్ వేస్తాను” అంటూ సంజీవ్ గోయెంకా మనసులోని మాటను గవాస్కర్ జోక్‌గా సరదా శైలిలో అనుకరిస్తూ వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఊహించని రీతిలో చేజ్ చేసింది.
ఈ మ్యాచ్‌లో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నో బౌలర్లను ఊచకోత కోస్తూ ఏకంగా 10 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఒకే ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టడం సూర్యవంశీకి ఇది మూడోసారి కావడం విశేషం. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా వైభవ్ నిలిచాడు.
ఈ 2026 ఐపీఎల్ సీజన్లోనే వైభవ్ సూర్యవంశీ 50 సిక్సర్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే సీజన్లో 50 సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఐపీఎల్ సీజన్లో 500కు పైగా పరుగులు చేసిన అతి చిన్న వయస్కుడైన ఏకైక బ్యాటర్‌గా రిషభ్ పంత్(Rishab Pant), దేవదత్ పడిక్కల్ పేరిట ఉన్న పాత రికార్డులన్నింటినీ ఈ వండర్ కిడ్ బద్దలు కొట్టాడు.
ఇవి కూడా చదవండి







