ఆటా 19వ అంతర్జాతీయ మహాసభల సందర్భంగా కథలు, కవితల పోటీలు!
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2026 జులై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న “19వ ఆటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్” సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ATA) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక సాహిత్య పోటీల నిర్వహణకు పూనుకుంది. అమ్మ భాష అభరణాలైన అక్షరాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కవులు, రచయితల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. సాహిత్యాభిమానులను అలరించేలా అంతర్జాతీయ అమెరికా జాతీయ స్థాయిలో రెండు వేర్వేరు విభాగాలుగా ఈ పోటీలు సాగనున్నాయి.
ప్రపంచవ్యాప్త నవలల పోటీ 2026
ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు రచయితలైనా ఈ నవలల పోటీలో పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు నిబంధనలు ఉన్నాయి. నవలల పోటీల మొత్తం బహుమతుల విలువ 2 లక్షల రూపాయలు. నవలల నేపథ్యం ప్రపంచంలో ఎక్కడిదైనా కావచ్చు, కానీ అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి. అచ్చులో కనీసం 150 పేజీలైనా ఉండాలి. రచనలు సొంతమైనవి, అనువాదాలు కానీవి ఇదివరకు ఎక్కడా ప్రచురితం కానివై ఉండాలి. తెలుగులో డీటీపీ చేసిన కాపీలను లేదా చేతిరాతను స్కాన్ చేసిన కాపీలను ata.abeditor@gmail.com ఈమెయిల్ ఐడీకి పంపాలి. నవల ప్రతి మీద రచయిత పేరు ఉండకూడదు (పూర్తి వివరాలు ఈమెయిల్ లో విడిగా రాయాలి). బహుమతి పొందిన నవలలను ప్రచురించే హక్కు ‘ఆటా’ సంస్థకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి

అమెరికా జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
ఈ విభాగం కేవలం అమెరికాలో నివసిస్తున్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తోంది. సప్త సముద్రాలు దాటినా తమ గుండె లోతుల్లోని భావాలను, సృజనాత్మకతను కథలు, కవితల రూపంలో వెలిబుచ్చాలనుకునే ప్రవాస తెలుగు రచయితలకు ఇది ఒక అపూర్వ వేదిక. ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి గల వారు అధికారిక ఆన్లైన్ గూగుల్ ఫామ్ లింక్ docs.google.com/forms/1FAIpQLSft/viewform ద్వారా లేదా బ్రోషర్ లోని క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే ataliterary@gmail.com ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ముగింపు తేదీ..
నవలలు, కథలు కవితలు పంపడానికి 2026 జూన్ 30 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ సాహిత్య యజ్ఞాన్ని ఆటా సాహిత్య కమిటీ చైర్మన్ వేణు నక్షత్రం, కో-చైర్స్ సూర్య నంపల్లి, రాజ్‌కుమార్ సలహాదారులు జయదేవ్ మెట్టుపల్లి, ప్రకాష్ తిమ్మపురం, రాజేశ్వర్ రావు టేక్మల్ ల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల విజయవంతం కోసం ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల తదితర కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి సమాచారం కోసం ఆటా కాన్ఫరెన్స్ అధికారిక వెబ్సైట్ www.ataconference.org ను సందర్శించవచ్చు.







